Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధ భ‌యం నెల‌కొన్న వేళ‌.. ఏకే 47 ప‌ట్టుకుని యుద్ధానికి సిద్ధ‌మ‌వుతోన్న బామ్మ ఫొటో వైరల్

grandma pic goes viral
  • కొన్ని రోజులుగా ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌
  • దేశ పౌరుల‌కు ఉక్రెయిన్ ఆర్మీ శిక్ష‌ణ
  • 79 అసాల్ట్ రైఫిల్‌ను వాడే శిక్షణ తీసుకుంటోన్న బామ్మ‌
కొన్ని రోజులుగా ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ర‌ష్యా సైన్యం ఇప్ప‌టికే ఉక్రెయిన్ సరిహద్దుల్లో భారీ ఎత్తున మోహరించడం వంటి చ‌ర్య‌ల‌కు దిగింది. ఉక్రెయిన్ పై ర‌ష్యా ఏ క్ష‌ణ‌మైనా దాడి చేసే ముప్పు ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోన్న వేళ.. భారీ ఆయుధ సంప‌త్తి ఉన్న ర‌ష్యాను ఎదుర్కోవ‌డానికి ఉక్రెయిన్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగా యువ‌కులు, మ‌ధ్య వ‌య‌స్కులే కాదు, పిల్లలు, వృద్ధులు కూడా శిక్ష‌ణ తీసుకుంటుండ‌డం గ‌మ‌నార్హం.

 ఈ క్రమంలో వాలెంటైనా కాన్‌స్టాంటినోవ్‌స్కా (79) అనే బామ్మ యుద్ధ‌ శిక్షణ తీసుకుంటోన్న ఫొటో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఈ ఉక్రెయిన్‌ బామ్మ ఏకే 47 గన్‌ని పట్టుకుని ఉంది. మారియుపోల్‌లో జాతీయ గార్డు సాయంతో 79 అసాల్ట్ రైఫిల్‌ను వాడే శిక్ష‌ణ తీసుకుంటోంది. త‌ల్లులు అంద‌రూ తమ పిల్లలను, దేశాన్ని రక్షించే పనిలో నిమగ్నమయ్యే సమయం ఆసన్నమైందని ఆమె చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఆమె దేశ భ‌క్తిని కీర్తిస్తూ నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.  


Viral Pics
Russia

More Telugu News